రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో గురువారం దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపడుతున్నారు.సోదాలు జరుగుతున్న సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఐప్యాక్ చీఫ్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటిపై కూడా తనిఖీలు జరగడం గమనార్హం. సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ ఆరోపించింది.

