
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు కొందరు ఆటగాళ్లు జట్టు మారేందుకు సిద్దమవుతుండగా.. కొందరేమో మేము మీతో కొనసాగలేం అంటూ ఫ్రాంచైజీలను వీడుతున్నారు టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ ఐపీఎల్ జట్టుకు బై బై చెప్పేశాడు. ఏడాది క్రితం లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా నియమితుడైన జహీర్ గురువారం తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా, కోచ్ జస్టిన్ లాంగర్‌తో పొసగకే అతడు రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం.