
సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరైన లోకేశ్, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబట్టాలని ప్రవాస తెలుగువారికి పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుగారిదేనని, ఆయనే మన బ్రాండ్ అని లోకేశ్ పేర్కొన్నారు.