తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ వాటికి ఆమోదం తెలిపింది. నగర పాలనలో మరింత పారదర్శకత కోసం తెలంగాణ మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లుతో పాటు.. జీహెచ్ఎంసీకి సంబంధించిన రెండు సవరణ బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును, మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లును ఆమోదించారు.

