
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ క్యాంపస్ ఇప్పుడు నూతన యుగానికి నాంది పలికింది. దేశంలో తొలిసారిగా విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిగా డ్రైవర్ లేని బస్సులు రవాణా సేవలు అందించటం గర్వకారణం. ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టీహన్)’ IIT హైదరాబాద్లో ఈ ప్రత్యేక విభాగం పూర్తిగా దేశీయంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం క్యాంపస్లో రెండు మోడళ్ల బస్సులు నడుస్తున్నాయి. ఇవి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి క్యాంపస్లో రవాణా సేవలు అందిస్తున్నాయి.