గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని పలు పబ్బుల్లో ఈగల్ బృందం తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో మొత్తం 64 మందికి డ్రగ్ టెస్టు నిర్వహించగా.. 8 మందికి డ్రగ్ పాజిటివ్ గా తేలింది. వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రగ్ పాజిటివ్ గా తేలిన వారిలో ఏపీకి చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది.

