క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేట్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో వేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

