ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు అందే ఉచిత వైద్య సేవలకు భారీ విఘాతం కలగనుంది. రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సేవలను నిలిపివేయనున్నట్లు రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం నుండి సుమారు రూ. 3,000 కోట్ల మేర నిధులు పెండింగ్లో ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

