
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలను అమలు చేసింది. మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులను వారి ప్రస్తుత పదవులనుంచి వేర్వేరు శాఖలకు బదిలీ చేస్త ఉత్తర్వులు జారీ చేశారు. శివశంకర్ లోతేటిను ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (APSPDCL) సీఎండీగా నియమించగా, రవి సుభాష్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమించారు.చక్రధర్ బాబును కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరుగా, ఎస్. ఢిల్లీరావును పౌరసరఫరాల శాఖ వైస్ ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.