
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.