నెల్లూరు జిల్లాలో అత్యంత అరుదైన, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న వన్యప్రాణి అలుగును (Pangolin) విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాపూరు – తెగచర్ల అటవీ ప్రాంతంలో ఈ అలుగును పట్టుకున్నట్లు నిందితులు ప్రాథమిక విచారణలో అంగీకరించారు. దీని చర్మంపై ఉండే పొలుసులు (Scales) మందుల తయారీలో వాడతారనే ప్రచారంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.

