
ఆస్ట్రేలియా (గోల్డ్ కోస్ట్) గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి మార్నీ వాట్సన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్–గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని. మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.