
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రెండు కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏలూరు దగ్గరలో ఏర్పాటు కానుంది. అన్ని స్టడీ సెంటర్లను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకువస్తారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను పునరుద్ధరించింది.