ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ముందు నుంచి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు.

