ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తుది నోటిఫికేషన్ను విడుదల చేస్తూ రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, ఒక జిల్లా కేంద్రం మార్పు, అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల సృష్టికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మార్పులు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చుతూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.

