
మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చ జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ద్వారా సుమారు ₹50,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) సంబంధిత ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సంబంధించిన నాలా చట్ట సవరణపై చర్చ జరిగింది.