కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహప్రవేశ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో చంద్రబాబు పర్యటించారు. టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. “ఇప్పటి వరకు 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. డిసెంబర్ లోపు మరో 4.50 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తాం. రాష్ట్రంలో 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే ఓ చరిత్ర” అని అన్నారు.

