ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారన్న క్రమంలో ఆయన భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతో పాటు మరో 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల సమస్య నెలకొందని, విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పించాలని ఆమె కోర్టును కోరారు.

