
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గానూ నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండో విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే మూడో విడతలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవటంతో ఫీజుల కోసం కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి.