
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం వైద్యారోగ్యశాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డు నమోదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.