మొంథా తుఫాన్ మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.ముందస్తు జాగ్రత్తగా ప్రసవానికి దగ్గరగా ఉన్న 787 మంది గర్భిణీ స్త్రీలను సమీపంలోని ఆసుపత్రులకు సురక్షితంగా తరలించినట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.

