రాష్ట్రంలోని దివ్యాంగులకు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సదరం (SADAREM) సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం, మార్చి 25వ తేదీ నుండి ఆన్లైన్లో స్లాట్ల బుకింగ్ ప్రారంభమవుతుంది. ప్రతి సోమవారము మరియు మంగళవారము గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మార్చి 30వ తేదీ నుండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

