ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, పాఠశాల విద్యార్థుల ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏపీ తెలుగు వర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు లీగల్ నోటీసు జారీ చేసింది. తమ ఆధీనంలో ఉన్న సంగీత, నృత్య పాఠశాల, కళాశాల విద్యార్థుల పరీక్షల నిర్వహణకు పరీక్ష ఫీజులు వసూలు చేయటమే కాకుండా.. పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీసులు ఇచ్చింది.

