
అమరావతిలో గురువారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 51వ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) సమావేశ ప్రతిపాదనలకు, అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని డిప్యూటేషన్, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అదనంగా, 993 కొత్త పోస్టుల మంజూరు కూడా నిర్ణయించారు.