
రాజధాని నగరం హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలయ్యింది. గురువారం ఉదయంనుండి ఉక్కపోత వాతావరణం ఉండగా సాయంత్రం సడన్ గా వర్షం మొదలయ్యింది. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా వర్షం కురవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. సరిగ్గా కార్యాలయాల నుండి ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్స్ మొదలయ్యాయి. పోలీసులు, జిహెచ్ఎంసి, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.