ఫార్ములా ఈ కారు రేసు కేసులో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. లై డిటెక్టివ్ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఏమీ లేదని రేవంత్‌కు కూడా తెలుసన్నారు.

