రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం. గోవర్దన్ అగ్రోనమి కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్‌కు డీన్‌గా పనిచేస్తున్నాడు. సీడ్ వ్యాపారం చేసే వ్యక్తి వ్యవసాయ శాఖ నుంచి సీడ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే డీన్ గోవర్దన్‌ను కలిశాడు, లంచడం డిమాండ్ చేయడంతో గతంలో రూ.25,000 ఇచ్చాడు. అయినా కూడా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారంతో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

