
భారత ప్రభుత్వం ప్రారంభించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అత్యవసర సేవల కోసం ఒకే నంబర్ 112 అందుబాటులోకి తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం సైతం 112 వ్యవస్థ ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు అందుకుంటోంది. పోలీస్ (100), ఫైర్ డిపార్ట్‌మెంట్ (101), మెడికల్ (108), మహిళల కోసం (181), బాలల రక్షణ (1098), విపత్తుల నిర్వహణ (1077) వంటి విభిన్న సేవలు 112కు కాల్ చేయడం ద్వారా అందుకోవచ్చు. ఏదైనా కాల్ రాగానే అన్ని వ్యవస్థలతో సమన్యయం చేసుకుంటూ మెరుపు వేగంతో సేవలు అందిస్తున్నారు.