మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో ఎల్బీనగర్ లో ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతలు ‘వైట్ ఛాలెంజ్’ విసిరారు. కాంగ్రెస్ నేతలు ఎల్బీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర నేతలు ఎల్బీనగర్ వెళ్ళిన క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాగ్వాదం చేసుకున్నారు. పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

