ఎల్పీజీ కొరత దేశమంతా ఉన్న సంగతి తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంపై కూడా పడింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా విద్యార్థులకు అన్నం బదులు పానీపూరీ (గోల్గప్పా)లు వడ్డించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీచర్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. దీనిపై ఆన్లైన్లో విస్తృత చర్చ జరుగుతోంది.

