
X, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత అయతే ఎలాన్ మస్క్ కమర్షియల్ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నారు. అయితే తన కొత్త AI సాధనం గ్రోక్ ఇమాజిన్‌ను మాత్రం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఇది కావాలంటే కొంత డబ్బులను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూజర్లకు ఇది ఫ్రీ. గ్రోక్ ఇమాజిన్ సాధనం అనేక AI మోడళ్లను కలిగి ఉంది. దీన్ని సాయంతో చిత్రాలను సృష్టించవచ్చు. అలాగే 6 సెకన్ల వీడియోలను సంగీతంతో సృష్టించవచ్చు. ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్లు, ఎఫెక్ట్‌లను జోడించవచ్చు.