సోమవారం (డిసెంబర్ 29) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీకి హాజరుకావాలని బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పార్టీ నేతలతో కెసిఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

