ఫ్రెంచ్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్ ఎ320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీని కారణంగా విమాన నియంత్రణ వ్యవస్థలకు సంబంధించిన కీలకమైన డేటా దెబ్బతిన్నట్టు పేర్కొంది. విమాన నియంత్రణపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. విమానాల్లో సాఫ్ట్వేర్ మార్చులు చేయాల్సి ఉందని తెలిపింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6వేల ఎయిర్‌బస్ విమానాల్లో ఈ మార్పులు చేయాలని స్పష్టం చేసింది. భారత్‌కు ఎయిర్ ఇండియా, ఇండిగో వద్ద ఎ320 విమానాలు 560 కి పైగా ఉన్నాయి.

