కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల హెచ్ఐవీ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ఏఆర్టీ సెంటర్లలో మందుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. బాధితులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 90 వేల మంది ఎయిడ్స్ రోగులకు పింఛన్లు ఇచ్చే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సదస్సులో మంత్రి వెల్లడించారు

