
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. కవిత, కేసీఆర్కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా..కవిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ..కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఆఫీసు ప్రారంభించింది. జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు. ఆమె తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.