మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ను ఎత్తివేయాలని నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించాలని ఆమోదం తెలిపింది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను ఎత్తివేయడంతో, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసే అవకాశం కలుగుతుంది. కేబినెట్ నిర్ణయం మేరకు ముందుగా ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదానికి పంపనున్నారు.

