
యువ ఫోక్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్‌కు దర్బంగాలోని అలీనగర్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి బీజేపీ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా ఎన్నికల కమిషన్ నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం అందజేసింది.