భారతీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, ఎన్నికల ఫలితాల అంచనాలు వెరసి ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్ల మేర ఎగిసిపడగా, నిఫ్టీ 50 కూడా ఒక శాతం కంటే ఎక్కువ లాభంతో ట్రేడ్ అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 24,200 స్థాయికి ఎగువన స్థిరంగా కదులుతోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

