
జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వ పాలనపై శశికళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. మేం ప్రజలకు మంచి పాలన అందించాం. అందుకే ఇప్పటి పరిస్థితులు చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాకే తెలుసు. స్టాలిన్, మిమ్మల్ని మరోసారి అధికారంలోకి రానివ్వను” అని ఆమె స్పష్టం చేశారు.