నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్, అతని సోదరుడు రాముల తొలిరోజు విచారణ ముగిసింది. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతినిచ్చింది. నెల్లూరు జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురావడం వల్ల తొలిరోజు విచారణ జాప్యమైందని సంబంధిత అధికారులు తెలిపారు. తొలిరోజు కేవలం ఒక గంటసేపు విచారణ సాగింది. ఈ నెల 29 వరకు మరో మూడు రోజులపాటు జోగి సోదరులను
ఎక్సైజ్ అధికారులు విచారించనున్నారు.

