గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం దేశం బాగుపడుతుందని నానుడి.. ఆ నానుడి అర్ధం పరమార్థం గ్రహించి… రేవంత్ రెడ్డిగారు సినిమా ప్రభావాన్ని గుర్తించి మళ్లీ అవార్డుల వేడుకకు పునర్జీవం పోశారు. అందుకు రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు. హాలీవుడ్ అంటే అగ్రరాజ్యం గుర్తొంస్తుంది. తెలంగాణ కూడా అలా ఎదగాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సినిమాను ప్రోత్సహించాలి. ఆయన ఆలోచన చేయాలని కోరుతున్నాను.

