ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం బుధవారం విజిలెన్స్ అధికారుల రాకతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం కార్యాలయానికి చేరుకున్న బృందం.. వివిధ విభాగాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టింది. విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో కార్యాలయంలోని కీలక అధికారులు కార్యాలయం నుంచి జారుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో విజిలెన్స్ బృందం అక్కడి కిందిస్థాయి సిబ్బందిని విచారించింది.

