బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది. సుమారు 2వేల కోట్ల రూపాయలు సమకూర్చాలని అధిష్ఠానం అల్టిమేటం ఇచ్చిందని అందుకే ఇటీవల సీఎం మంత్రులకు విందు పేరిట టార్గెట్ ఇచ్చారని ప్రతిపక్షనేత అశోక్ ఘాటుగా విమర్శించిన విషయం విదితమే. ఎంపీ రాఘవేంద్ర వ్యాఖ్యలపై డీసీఎం డీకే శివకుమార్ సున్నితంగా మందలించారు. బీజేపీ, జేడీఎస్లో వారి తరహాలో నీవెందుకు వ్యవహరిస్తావంటూ మందలించారు.

