తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 20 నెలల అసమర్థ, అరాచక, అవినీతి పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని అన్నీ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు రానున్న ఉపఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను డిక్లరేషన్ల పేరుతో మోసం చేశారని ఆరోపించారు.

