
పరుగురాతిపాలెం గ్రామానికి చెందిన చిన్నారికి తీవ్రజ్వరం రావడంతో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో తల్లి లారీకి సంబంధించిన టైర్ ట్యూబుతో ప్రాణాలకు తెగించి దాటించింది. దేవుడు ఆశీస్సులు ఏమోగానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంత ఫ్లోటింగ్ లో కూడా దాదాపు మునిగిపోయినప్పటికీ ఒడ్డుకు చేరుకుంది. తూర్పు ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పత్రిపాలెం, పింజరకొండ వంటి ప్రాంతాల మధ్యలో పెద్దవాగు అత్యధికంగా నీరు ఉన్నా లేకపోయినా ఈ వాగు దాటితే తప్ప గత్యంతరం లేని పరిస్థితులు పరుగురాతిపాలెం ప్రజలకు ఉంటుందని చెప్పుకోవచ్చు.