ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు. యుద్దాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు దేశాధినేతలు మంతనాలు జరిపారు. శాంతి, సుస్థిరత కోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యుద్దంపై ఇప్పటికే గల్ప్ దేశాధినేతలతోనూ ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల చర్చలు, దౌత్యానికి తిరిగి రావాల్సిన అవసరం గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

