ఎమ్మెల్యే సార్‌ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతానని ఇంట్లోకి వెళ్లాడు. ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పడిగుద్దులు కురిపించాడు. రెప్పపాటులో అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు. ఈ విస్తుబోయే ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. బాధిత వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన జ్యోతిప్రియ మల్లిక్. సదరు ఎమ్మెల్యే సాక్షాత్తూ తన నివాసంలోనే దాడికి గురయ్యారు.
      
