
చాలామంది మహిళలు పెళ్లి లేదా పిల్లల కోసం ఉద్యోగం మానేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికి ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగం మానేసి తిరిగి చేరాలనుకునే మహిళల కోసం “రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్” అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా సెలీనియం, జావా, ఒరాకిల్, సేల్స్ఫోర్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అనుభవం ఉన్న మహిళలను తిరిగి పనిలోకి తీసుకోవాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. ఇది కంపెనీలో ఉద్యోగుల మధ్య వైవిధ్యాన్ని పెంచేందుకు ఒక ముఖ్యమైన అడుగు.