
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ దూకుడును పెంచింది. భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ అధికారులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా దాడికి పాల్పడిన మరో ఉగ్రవాది ఇంటిని కూల్చివేశారు. ఆదిల్ గురీని పట్టించిన వారికి రూ. 20 లక్షల రివార్డ్ ఇస్తామని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. 2018లో ఆదిల్ అక్రమంగా పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ అతను ఉగ్రవాద శిక్షణ పొందాడని, గత ఏడాది జమ్మూ కశ్మీర్‌కు తిరిగి వచ్చాడని సమాచారం.