
దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ లో శ్రీధార్మిక్ లీల కమిటీ ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ము రామబాణం ఎక్కుపెట్టగా.. రావణ దహనం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదం అనే రావణుడిపై మానవత్వం సాధించిన విజయానికి ప్రతీక అన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న భారత సైనికులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.